![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -169 లో... రామరాజుకి శ్రీవల్లి ఫొటోస్ చూపించడంతో సాగర్ , నర్మద రాగానే తిడతాడు. చెప్పిన పని చెయ్యకుండా భార్యతో కలిసి షికారు అంటూ తిరుగుతావా అని సాగర్ పై రామరాజు విరుచుకుపడతాడు. చిన్నోడికి బాధ్యత తెలియదు.. నీకు నా మాట అంటే విలువ లేదని సాగర్ ని రామరాజు తిడతాడు.
ప్రేమ గదిలోకి వచ్చేసరికి నర్మద ఉండదు.. కోపంతో ఎక్కడికైనా వెళ్ళిందేమోనని వేదవతితో ప్రేమ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళదు.. నాకూ తెలుసు ఎక్కడికి వెళ్లి ఉంటుందో అని కిచెన్ లోకి తీసుకొని వెళ్తుంది వేదవతి. అక్కడ నర్మద కోపంతో అరిసెలు తింటుంది. అది చూసి ప్రేమ నవ్వుకుంటుంది. అసలు మావయ్య గారికి ఫోటోస్ ఎవరు చూపించారని నర్మద అడుగుతుంది. వేదవతి చెప్పకంటున్నా కూడా ప్రేమ వినకుండా శ్రీవల్లి పేరు చెప్పగానే ఆవేశంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది నర్మద.
మావయ్య గారికి ఎందుకు ఫోటోస్ చూపించావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది. ప్రతీదాంట్లో ఎందుకు దూరతావని నర్మద అడుగుతుంది. నేను ఈ ఇంటికి పెద్దకోడలిని అని శ్రీవల్లి అంటుంది. ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే వేదవతి వచ్చి ఆపుతుంది. మీరు ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నారని అడుగుతుంది. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకోకని చెప్పండి అని వేదవతితో నర్మద చెప్తుంది. ఆ తర్వాత రాత్రివేళ ధీరజ్ ని ఆట పట్టిస్తుంది ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |